: భారత్ లో ఉద్యోగావకాశాల కల్పనకు సింగపూర్ ఉపప్రధాని సలహా
తయారీరంగాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారా భారత్ మరిన్ని ఉద్యోగావకాశాలను కల్పించుకోవచ్చని సింగపూర్ ఉపప్రధాని తర్మన్ షణ్ముగరత్నం సూచించారు. సింగపూర్ లో జరిగిన దక్షిణాసియా దేశాల సమావేశంలో ఆయన మాట్లాడారు. వస్తువులను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడం ద్వారా భారత్ వృద్ధి చెందడంతోపాటు ఆగ్నేయాసియా దేశాలతో ఐక్యత పెంచుకోవడానికి తోడ్పడుతుందన్నారు. భారత్ లో ఉన్న కార్మిక శక్తి, వేతనాల స్థాయిలో ఉన్న సానుకూలతలతో తయారీ రంగంలో మంచిగా ఎదగవచ్చన్నారు. అయితే, ఇందు కోసం కార్మిక చట్టాలను, ఆర్థిక విధానాలను సరళించాలని, దాంతో ప్రైవేటు రంగం నిధుల సేకరణకు మార్గం సుగమం అవుతుందని సూచించారు.