: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మాయం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం, రక్షణ అంటే 'గాల్లో దీపం పెట్టి.. మీరే దిక్కు' అన్నట్లుగా ఉంది. ఈ మాటలను రుజువు చేస్తూ.. ఆసుపత్రి సిబ్బంది కూడా, చికిత్స చేయించుకునేందుకు వచ్చేవారిపట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు.
ఇందుకు తగ్గట్టుగా, తాజాగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన 8 రోజుల మగ శిశువు మాయమైంది. నెలలు కూడా నిండని బిడ్డ కనిపించకపోవడంతో నల్గొండకు చెందిన బాలింతరాలు బోరున విలపిస్తోంది.
అయితే, ఈ ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి 'మీ బంధువులే తీసుకు రమ్మంటున్నారు' అని చెప్పి, బాబును తీసుకెళ్లిందని కుటుంబసభ్యులు చెప్పారు. ఆమే శిశువును ఎత్తుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి.