: 2014 ఎన్నికల్లో ఉగ్రవాదులు ఆటంకం కలిగించే అవకాశం: ప్రధాని
రాష్ట్రాల డీజీపీ, ఐజీపీలతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ లో ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక ప్రసంగం చేశారు. రానున్న 2014 ఎన్నికల్లో ఉగ్రవాదులు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో నక్సలిజాన్ని అణచివేయొచ్చని అభిప్రాయపడ్డారు. నక్సలిజాన్ని నియంత్రించడంలో పారామిలటరీ బలగాలు కీలక పాత్ర వహించాయని చెప్పారు. సైబర్ క్రైంను తగ్గించే బాధ్యత రాష్ట్రాలపై ఉందన్న ప్రధాని.. దర్యాప్తు సంస్థల పనితీరు మెరుగుపడుతోందన్నారు. కాగా, సోషల్ మీడియాతో అపశృతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.