: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం


ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. ఆ చిన్నారిపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేస్తుండగా... మిగిలిన వారు ఆ ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఈ నెల 15వ తేదీన జరిగింది. అత్యాచారం చేసిన బాలురు... తాము చిత్రీకరించిన దృశ్యాలను బ్లూటూత్ ద్వారా తమ స్నేహితులకు పంపారు. దీంతో, ఈ విషయం వెలుగు చూసింది. చివరకు జరిగిన సంఘటనను తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... అత్యాచారం చేసిన ముగ్గురు బాలురపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News