: బడ్జెట్ కు తుదిరూపునిస్తున్న సర్కారు
మరికొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నతరుణంలో, రాష్ట్ర సర్కారు తన వార్షిక బడ్జెట్ కు తుది మెరుగులు దిద్దుతోంది. ఈమేరకు మంత్రివర్గం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం సచివాలయంలో బడ్జెట్ విషయమై సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కాగా, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.