: గడ్డికి ప్రత్యామ్నాయం...


పశువులు తినే గడ్డికి ప్రత్యామ్నాయం కూడా ఉంటుందా... అంటే ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకూ పశువులను పెంచేవారికి వాటికి పెట్టడానికి సరైన దాణా లభించడం కష్టంగా ఉంది. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇందులో భాగంగా ఒక సరికొత్త దాణాను గురించి తెలుసుకున్నారు. ఈ దాణాను అటు పశువులు ఇష్టంగా తినడంతోబాటు బాగా పాలు కూడా ఇస్తున్నాయట.

పశువులకు కడుపునిండా సరైన మేత లేకుంటే అవి పాలు కూడా తక్కువగా ఇస్తాయి. దీంతో పాల దిగుబడి తగ్గడంతో పాల ఉత్పత్తిదారులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపధ్యంలో టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌ (టీఎంఆర్‌) అనే దాణా గురించి పాల ఉత్పత్తిదారులకు తెలిసింది. ఈ దాణా మిశ్రమాన్ని కేరళలోని అలువ అనే ప్రాంతంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఈ మిశ్రమాన్ని తిన్న పశువుల్లో చాలా స్పష్టమైన తేడా కనిపిస్తోందట. వీటిని తిన్న పశువుల్లో పాల ఉత్పత్తి పెరగడంతోబాటు వాటి ఆరోగ్యం కూడా బాగా మెరుగవుతోందట. ఈ కొత్త దాణా మనం గ్రామాల్లో ఉపయోగించే తెలక పిండి, తవుడు లాంటిదే. ఇందులో పశువులకు అవసరమైన పోషకాలన్నింటినీ మిశ్రమంగా చేశారు.

అమెరికాలో విరివిగా ఉపయోగించే టీఎంఆర్‌లో కందులు, నువ్వులు, వేరుశెనగలు, మొలాసిస్‌, ఉప్పు, విటమిన్లు, ఖనిజాల మిశ్రమం, విష రసాయనాలను తొలగించే టాక్సిన్‌ బైండర్‌ వంటివి ఇందులో మిశ్రమంగా ఉంటాయి. ఈ దాణావల్ల ఎన్నో ఉపయోగాలున్నాయట. దీనికయ్యే ఖర్చు తక్కువేకాదు, ఇది ఎక్కువరోజుల పాటు నిల్వ ఉంటుంది. పశువులు కూడా వాటికి కావాల్సినంతమేర మాత్రమే దీన్ని తింటాయని పశువైద్యులు ఉన్నికృష్ణన్‌ చెబుతున్నారు. రాజస్థాన్‌లోని ఒక నిపుణుడి వద్ద ఈ కొత్తరకం దాణాను గురించి తెలుసుకున్న ఉన్నికృష్ణన్‌ దీన్ని కేరళలోని రైతులకు పరిచయం చేశారు. ఈ దాణా పశువులను ఆరోగ్యంగా ఉంచడంతోబాటు ఇటు పాల దిగుబడి కూడా పెంచుతోందట.

  • Loading...

More Telugu News