: బెంగళూరు ఏటీఎంలో మహిళపై దాడి కేసులో పురోగతి
బెంగళూరు నగరంలో ఏటీఎంలో మహిళపై దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా టిపటూర్ లో 33 ఏళ్ల వయసున్న సతీష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇతను అసలు నిందితుడు అవునో కాదో ఆరా తీస్తున్నారు. ఇతనే నిందితుడు అని నిర్థారణ కాలేదు. ఇతను ఐటీ ఇంజనీర్ గా పని చేస్తున్నాడని సమాచారం.