: ఉదయం కాన్పు.. మధ్యాహ్నం పరీక్ష
ఈ రోజే జన్మించిన కవల పిల్లలు సహా ఓ తల్లి బీఈడీ పరీక్షకు హాజరైంది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో సత్యసాయి నగర్ కు చెందిన గీతావాణి స్థానిక శ్యామలారత్నం కళాశాలలో బీఈడీ చదువుతున్నారు. నిండు చూలాలైనప్పటికీ గత ఐదు రోజులుగా పరీక్షలు రాశారు. ఈ రోజు మధ్యాహ్నం మరో పరీక్ష ఉండగా, జీవితంలో అతిపెద్ద పరీక్షలో ఉదయం పది గంటలకు ఆమె పాసయ్యారు. ఈ పరీక్షలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అయినప్పటికీ విద్యాసంవత్సరం వృథా కాకూడదన్న ఉద్దేశంతో పరీక్షకు హాజరయ్యారు. పిల్లలను తీసుకుని అంబులెన్స్ లో అమె పరీక్ష కేంద్రానికి వచ్చారు. కళాశాల సిబ్బంది ఆమెకు ఇబ్బంది కలుగకుండా పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేశారు.