: తెరమీద ముద్దు సీన్లు మనకి పడవు: సైఫ్ ఆలీ ఖాన్


హమ్ తుమ్, సలాం నమస్తే సినిమాల్లో హీరోయిన్లతో ఘాటు ముద్దు సీన్లను పండించిన సైఫ్ ఆలీఖాన్ భారతీయ సినిమాల్లో ముద్దుసీన్లే అక్కర్లేదంటున్నాడు. పెళ్లికి ముందు తన భార్య కరీనా కానీ, తాను కానీ ముద్దుసీన్లలో నటించమని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తే, 'ఇప్పుడు అలాంటి రూల్స్ ఏవీ లేవు కానీ, మన సినిమాల్లో ముద్దు సీన్లు అవసరం లేదు' అన్నాడు ఈ బాలీవుడ్ హీరో. అలాంటి వాతావరణం మనకు సరిపడదన్న సైఫ్, ఆ సీన్లు లేకపోయినా మన సినిమాలు బ్రహ్మాండంగా ఆడతాయని అన్నాడు. అలాంటి సీన్లు చూసినప్పుడైనా, చేసినప్పుడైనా అంత సౌకర్యవంతంగా ఉండదని అన్నాడు. హాలీవుడ్ సినిమాల్లో ముద్దు సీన్లు కానీ, శృంగార సన్నివేశాలు కానీ ఇబ్బందిగా అనిపించని రీతిలో ఉంటాయన్నాడు. ఇందులో అంతరార్థాన్ని వెతకడంలో మన సినీ జనాలు బిజీ అయిపోయారు.

  • Loading...

More Telugu News