: 'ఓటుకు నోటు' కేసులో అమర్ సింగ్ ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
2008లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ సహచరుడు సుధీంద్ర కులకర్ణిలను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. మరో ఇద్దరు బీజేపీ ఎంపీలు అశోక్ అర్గల్, ఫగ్గన్ సింగ్ కులస్తేలతో పాటు ఇంకో ఇద్దరినీ నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. కాగా, గతంలో అమర్ సింగ్ సహాయకుడిగా ఉన్న సంజీవ్ సక్సేనాపై అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.