: కేంద్రం సీమాంధ్రను పాకిస్థాన్ లా చూస్తోంది: మంత్రి ఏరాసు


రాష్ట్రాన్ని విభజించి తెలుగు ప్రజలు కొట్టుకునేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రాంతాన్ని పాకిస్థాన్, చైనా దేశాల మాదిరి చూస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగితే రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని అనంతపురం, కర్నూలు జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అంశం పరిష్కరించకపోతే భవిష్యత్తులో విబేధాలు తలెత్తుతాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News