: దక్షిణ అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం 22-11-2013 Fri 15:03 | బంగాళాఖాతంలో ఏర్పడిన హెలెన్ తుపాను ఇటు తీరాన్ని తాకగానే... అటు దక్షిణ అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.