: ఎమ్మార్వోను బలితీసుకున్న హెలెన్


హెలెన్ తుపాను పశ్చిమగోదావరి జిల్లాలో ఓ అధికారి ప్రాణాన్ని బలిగొంది. ఈదురు గాలులు, వర్షం ప్రభావంతో జిల్లాలో చెట్లు విరిగిపడ్డాయి. సహాయ కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించేందుకు పెనుమంట్ర ఎమ్మార్వో దంగేటి సత్యనారాయణ తన కారులో అధికారులతో కలసి బయల్దేరారు. మార్గమధ్యంలో విరిగిపోయిన చెట్లు రోడ్డుకు అడ్డంగా పడున్నాయి. అదేసమయంలో వెనుక నుంచి లారీ వస్తుండటం, దగ్గరలోనే మలుపు ఉండటంతో... కారు ఓ చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఎమ్మార్వో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు.

  • Loading...

More Telugu News