: ఎక్కడో ఓ చోట విభజన ప్రక్రియ ఆగుతుంది: గంటా
విభజన ప్రక్రియ ఎక్కడో ఓ చోట ఆగిపోతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, విభజనపై ఐబీ చీఫ్ కూడా సంతృప్తి వ్యక్తం చేయలేదని అన్నారు. జాతీయ పార్టీలు విభజన నిర్ణయాన్ని అడ్డుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం తీరు తమకు అర్థం కావడం లేదని, ఎంత మంది వ్యతిరేకిస్తున్నా విభజన జరుపుతామనడం సరికాదని ఆయన హితవు పలికారు.