: మృత్యుంజయులు..భీకర తుపానులో సైతం ఒడ్డుకొచ్చారు
చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు ఈ మధ్యాహ్నం నిజాంపట్నం నక్షత్ర నగర్ బీచ్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం వేటకు వెళ్లిన వీరు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అధికారులు కూడా వీరిని గాలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే భీకర తుపానును ఎదుర్కొని వీరు ఎట్టకేలకు ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హర్షాతిరేకం వ్యక్తం చేశారు.