: పెళ్లి విషయంలో మోడీకి వ్యతిరేకంగా దాఖలైన పిల్ కొట్టివేత


2012 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఎలక్షన్ కమిషన్ కు అసంపూర్ణ డిక్లరేషన్ సమర్పించారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మోడీ తన అఫిడవిట్ లో వైవాహిక స్థితి కాలమ్ లో వివరాలు పేర్కొనకుండా ఖాళీగా వదిలేశారని సునీల్ సరాగి తన పిల్ లో పేర్కొన్నారు. మోడీ నామినేషన్ పత్రాలను తిరస్కరించరాదని ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. అయితే, ఈ విషయాలను ఈసీ చూసుకుంటుందని ఇందులో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News