: యూటీ చేయొద్దని సోనియాకు చెప్పా: ఓవైసీ
హైదరాబాదును యూటీ చేయొద్దని కాంగ్రెస్ అదినేత్రి సోనియా గాంధీకి చెప్పినట్లు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూటీ చేయడంవల్ల మైనార్టీలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపానన్నారు. జీఓఎంకు ఇచ్చిన నివేదికే మరోసారి సోనియాకు ఇచ్చానని చెప్పారు. హైదరాబాదు యూటీ అంశంపై రాష్ట్రపతి, ప్రధానిలను కూడా కోరతానన్నారు. ఢిల్లీలో సోనియాతో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఓవైసీ.. పై విషయాలను వెల్లడించారు.