: తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు


'హెలెన్' తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు ప్రభుత్వ స్కూళ్లకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాలైన పల్లెపాలెం, పెడన, తుదివెన్ను, కోడూరు, నాగాయలంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారి కోసం 127 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News