: ఎంపీలను, నిరుద్యోగులనూ మోసపుచ్చిన మహా కేటుగాడు


ఎంపీలు, ఎమ్మెల్యేలను బోల్తా కొట్టించడంలో అతడు మహా నేర్పరి. నిరుద్యోగులను నిలువునా ముంచడంలో మహా మాయగాడు. 17 సార్లు అరెస్టయ్యాడు. బెయిల్ పై విడుదలయ్యాడు. కానీ, అలవాటైన తీరు కదా. మరోసారి ఎంపీలు వీ హనుమంతరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, దేవేందర్ గౌడ్ ను మోసగించి హైదరాబాద్ క్రైమ్ పోలీసులకు దొరికిపోయాడు.

ఎన్టీపీసీ మాజీ ఉద్యోగి అయిన తోట బాలరాజు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు కాల్ చేసి తాను రాజీవ్ యువకిరణాలు ప్రాజెక్టు డైరెక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. మీ నియోజకవర్గాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను. ప్రతిపాదనలు పంపాలని కోరాడు. వారు పంపిన నిరుద్యోగుల దరఖాస్తులను పరిశీలించి రిజిస్ట్రేషన్ రుసుమును బ్యాంకు ఖాతాలో జమ చేయాలని సంబంధిత నిరుద్యోగ అభ్యర్థులను కోరేవాడు. అలా ఇప్పటి వరకూ 22 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా నిరుద్యోగుల నుంచి 6.31లక్షల రూపాయలను దండుకున్నాడు.

  • Loading...

More Telugu News