: ఇద్దరు మానసిక రోగులను హతమార్చిన మరో రోగి
పుణేలోని ప్రాంతీయ మానసిక చికిత్సాలయంలో ముగ్గురు మానసిక రోగుల మధ్య గొడవ హత్యలకు దారితీసింది. ఆస్పత్రిలో దీపక్ సురవసే(28) అనే మానసిక రోగి.. తోటి రోగులు బాబూరావు పాండురంగ లాండ్జే(38), సవాజీ భన్వాడియా(52)పై దాడిచేసి హతమార్చాడు. దీపక్ సురవసే తన బెడ్ పై పడుకోగా అతడి దుప్పటిని బాధితుల్లో ఒకరు కిందక నెట్టేయగా.. మరొకరు వేధించడం మొదలుపెట్టాడు. కోపంతో సురవసే ఆ ఇద్దరిలో ఒకరిని గోడకేసి, మరొకరిని నేలకేసి బలంగా మోది ప్రాణం తీశాడు.