: 1.5 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడనున్న అలలు
హెలెన్ తుపాను తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో సముద్రం అత్యంత అల్లకల్లోలంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ సమయంలో అలలు దాదాపు ఒకటిన్నర మీటరు ఎత్తు వరకు ఎగిసిపడతాయని తెలిపింది. ఇదే సమయంలో ఇంటి పైకప్పులు ఎగిరిపోవడం, టెలిఫోన్ స్తంభాలు, భారీ వృక్షాలు కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో అధికారులు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి తోడు మత్స్యకారులను చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకుండా హెచ్చరించారు.
ఇప్పటికే మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవుల్లో పదోనంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడలో తొమ్మిదో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం, విశాఖ, కళింగపట్నం, గంగవరం, భీమునిపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.