: ఆ ఇంట్లో 200 ఓట్లు.. వారింటి చుట్టూ నేతల ప్రదక్షిణలు
ఒక ఇంట్లో సాధారణంగా నాలుగైదు ఓట్లు ఉంటాయి. పెద్ద కుటుంబం అయితే పదో పదిహేనో. కానీ మిజోరం రాష్ట్రం, తుయ్ కుమ్ నియోజకవర్గం పరిధిలోని బక్త్వాంగ్ గ్రామంలో మాత్రం జియోనా ఛనా(68) కుటుంబంలో 200 ఓట్లు ఉన్నాయి. ఇవేమీ దొంగ ఓట్లు కాదండోయ్. ఛనాకు 39 మంది భార్యలు. వారి పిల్లలు, వారి వారి పిల్లలు, బంధువులు ఇలా ఆ ఇంట్లో ఓటు హక్కు ఉన్న వారి సంఖ్యే 200దాటేసింది. వెరసి ఆ ఇల్లు ఓట్ల కోటగా మారింది. వీరి ఇల్లు కూడా 100 గదులతో ఉంటుంది. దీంతో నేతలు వీరింటి చుట్టూనే మళ్లీ మళ్లీ తిరుగుతూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మిజోరం అసెంబ్లీకి ఈ నెల 25 ఎన్నికలు జరుగుతున్నాయి.