: కోచి వండేలో వెస్టిండీస్ పై భారత్ గెలుపు


వెస్టిండీస్ తో జరిగిన తొలి వండే మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది. కోచి లోని నెహ్రూ స్టేడియంలో ఈ రోజు జరిగిన డే నైట్ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయదుందుభి మోగించింది. 225 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 35.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి, విండీస్ ను మట్టి కరిపించింది. విరాట్ కోహ్లీ 86 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 72 పరుగులు చేశాడు. ఈ సీరీస్ లో విండీస్ తో భారత్ మరో రెండు వన్డేలు ఆడాల్సి వుంది.

  • Loading...

More Telugu News