: ఈ నెలాఖరుకి అసెంబ్లీకి తెలంగాణ బిల్లు: బొత్స
తెలంగాణ బిల్లు ఈ నెలాఖరుకి అసెంబ్లీకి వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమన్వయకమిటీ సమావేశంలో చెప్పారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన తన స్వంత నియోజకవర్గం చీపురుపల్లి వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ విషయాన్ని జీవోఎంలో చర్చించినట్టు వెల్లడించినట్టు సమన్వయకమిటీ సమావేశంలో దిగ్విజయ్ చెప్పారని అన్నారు.