: బళ్లారితోనే రాయలసీమ అస్తిత్వం పోయింది: జేసీ


రాయలసీమ అస్తిత్వం బళ్లారితోనే పోయిందని, ఇప్పుడు కొత్తగా పోయేదేమి లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణ గురించి తాను, మంత్రి కోట్ల కలిసి సోనియా అపాయింట్ మెంట్ కోరామని, త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతపురంలో మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన జేసీ.. 371 డి ప్రకారం ఇప్పట్లో విభజన జరగదన్నారు. జీవోఎం ఏమి చేసినా చివరికి నిర్ణయం తీసుకోవాల్సింది సోనియా గాంధీయేనన్నారు. అయితే, సోనియా అంగీకరిస్తే రాయల తెలంగాణ ఏర్పడి తీరుతుందని జేసీ ధీమా వ్యక్తం చేశారు. రాయల తెలంగాణపై కర్నూలు, అనంతపురానికి చెందిన టీడీపీ నేతలు సుముఖంగా ఉన్నా, వ్యాఖ్యానించడానికి తాను ఇష్టపడటం లేదన్నారు.

  • Loading...

More Telugu News