: గాజుపెట్టెలో శాశ్వతంగా చావెజ్ పార్థివశరీరం


క్యాన్సర్ వ్యాధితో మృతి చెందిన వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ పార్థివ దేహాన్ని శాశ్వత సందర్శన కోసం గాజుపెట్టెలో భద్రపరచనున్నారు. చావెజ్ మృతదేహానికి అధికారికంగా ఈరోజు అంత్యక్రియలు జరిగిన వెంటనే మిలటరీ మ్యూజియంలో భద్రపరిచే ప్రక్రియ ఉంటుందని తాత్కాలిక అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో ప్రకటించారు. మావో, లెనిన్ మృత శరీరాలు కూడా ప్రజా సందర్శనార్థం ఇదే విధంగా భద్రపరిచారు. ప్రత్యేక రసాయనాలు పూయడం ద్వారా దేహం పాడవకుండా పరిరక్షిస్తారు. 

  • Loading...

More Telugu News