: మాకు నచ్చలేదు.. కౌంటింగ్ ఆపండి


నేపాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎన్-మావోయిస్టు పార్టీ బొక్క బోర్లా పడింది. ఈ రోజు ఉదయం కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ పార్టీలు ఆధిక్యంలోకి వెళ్లాయి. తమ ఓటమిని ముందుగానే గుర్తించిన మావోయిస్టులు కౌంటింగ్ ఆపేయాలని పట్టుబట్టారు. ఈ ఎన్నికల్లో కుట్ర జరిగిందని, వెంటనే కౌంటింగ్ ఆపాలని డిమాండ్ చేశారు. అయితే, కౌంటింగ్ లో ఎలాంటి అవకతవకలు జగరలేదని, పారదర్శకంగా కౌంటింగ్ కొనసాగుతోందని నేపాల్ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నీల్ కాంత ఉప్రేటి తెలిపారు. కాగా, సుశీల్ కోయిరాలా సారధ్యంలోని నేపాలీ కాంగ్రెస్ 69 స్థానాల్లో ముందంజలో ఉండగా సీపీఎన్-యూఎంఎల్ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మావోయిస్టులు కేవలం 16 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News