: 'తెహల్కా' తరుణ్ తేజ్ పాల్ కేసులో విచారణకు ఆదేశం


'తెహల్కా' పత్రిక స్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ కేసులో ప్రాథమిక విచారణకు గోవా ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల మొదట్లో ఓ కార్యక్రమం కోసం గోవా వెళ్లిన తెహల్కా సంస్థ ఉద్యోగులు ఓ హోటల్లో బసచేశారు. ఆ సమయంలో తనపై తేజ్ పాల్ రెండుసార్లు లైంగిక దాడికి యత్నించినట్లు, సంస్థలో పనిచేసే మహిళా జర్నలిస్టు తెహల్కాలోని తన పై అధికారులకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది. అయితే, అటు తెహల్కా స్పందనపై తాను తీవ్రంగా కలత చెందినట్లు జర్నలిస్టు తెలిపింది. కాగా, ఘటనపై ఫిర్యాదు చేయాలని గోవా పోలీసులు బాధితురాలిని కోరనున్నారు. మరోవైపు దాడికి యత్నించిన సమయంలో హోటల్లో రికార్డైన సీసీటీవీ ఫూటేజీని ఇవ్వాలని గోవా పోలీసులు హోటల్ యాజమాన్యాన్ని కోరారు.

  • Loading...

More Telugu News