: యాషెస్.. తొలి రోజు ఆస్ట్రేలియా 273/8


ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ఆస్ట్రేలియాలో ప్రారంభమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో ఆరంభమైన మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో మొదట్లో తడబడ్డ ఆసీస్, అనంతరం గౌరవప్రద స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. వార్నర్(49), వాట్సన్(22), స్మిత్(31), జాన్సన్(64) రాణించగా ఆసీస్ ను ఆదుకున్న హడిన్(78)కు జతగా హ్యారీస్ (4)క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News