: తెలంగాణ ఏర్పాటుపై ఐబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
దేశ భద్రతపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన డీజీపీ, ఐజీల సమావేశంలో ఐబీ చీఫ్ ఇబ్రహీం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు అంశం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైనది కాదని అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు.