: 'నిర్భయ'కు స్త్రీ శక్తి అవార్డు


కామాంధుల కిరాతకానికి అర్థాంతరంగా తనువు చాలించినా.. దేశ ప్రజల హృదయాల్లో ఆత్మస్థయిర్యానికి ప్రతీకలా నిలిచిపోయిన ఢిల్లీ వైద్య విద్యార్థిని 'నిర్భయ'కు స్త్రీ శక్తి అవార్డు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును ఆమె కుటుంబ సభ్యులకు అందిస్తారు.

ప్రతి ఏడాది మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశంలో ప్రభావవంతమైన మహిళలకు ఈ స్త్రీ శక్తి పురస్కారం పేరిట ఆరు అవార్డులు బహూకరిస్తారు. వీటిలో ఝాన్సీ లక్ష్మీబాయి పురస్కారం 'నిర్భయ'కు ఇవ్వనున్నట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News