: హైదరాబాద్ ను యూటీ చేస్తేనే విభజన.. లేకుంటే ఒప్పుకోం: కేంద్ర మంత్రులు
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రుల సమావేశం ముగిసింది. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం మంత్రుల బృందాన్ని కలిసి తమ డిమాండ్లను వివరించారు. ప్రధానంగా హైదరాబాదుపై తమ డిమాండ్ ను స్పష్టంగా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను యూటీ చేసిన తరువాతే మిగిలిన విషయాలపై చర్చిద్దామని తెలిపారు. హైదరాబాద్ ను యూటీ చేయకుంటే విభజనకు ఒప్పుకునేది లేదని వారు స్పష్టం చేశారు. ప్యాకేజీలపై మాట్లాడాలన్నా హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.