: ధరల పరుగులో ఉల్లిని దాటేసిన వెల్లుల్లి
అసమర్థ పాలకుల హయాంలో నిత్యావసరాలు అన్నీ మండిపోతున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకూ అందరి ఆహారంలో భాగమైన ఉల్లిపాయల ధర ఇప్పటికే సెంచరీ కొట్టేయగా.. వెల్లుల్లి ధర కూడా ఉల్లిని దాటేసి ముందుకు వెళ్లింది. మెట్రోలలో కిలో వెల్లుల్లిపాయలను 100 నుంచి 130 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీలో హోల్ సేల్ ధరే 100 రూపాయలు పలుకుతోంది.
కొత్త పంట రావడంలో ఆలస్యం కారణంగానే ధరలు ఒక్కసారిగా పెరిగాయని వర్తకులు అంటున్నారు. అయితే, నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ (ఎన్ హెచ్ ఆర్ డీఎఫ్) డైరెక్టర్ ఆర్ పీ గుప్తా మాత్రం వెల్లుల్లి నిల్వలు తగినంత ఉన్నాయని చెబుతున్నారు. కొత్త పంట జనవరి నుంచి మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. అంటే అదును చూసి వ్యాపారులు ధరల మంటను రాజేసినట్లు తెలుస్తోంది.