: పాట్నా పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ పై ఎఫ్ఐఆర్
పాట్నా పేలుళ్ల కేసులో ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ పై బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడి గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ సంస్థ సభ్యుడు తెహసీన్ అక్తర్ తో పాటు పలువురి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. గతనెల నరేంద్ర మోడీ 'హుంకార్' సభ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే.