: హైదరాబాదుపై ప్రయోగాలు చేయొద్దు: లగడపాటి
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాదుపై తన వాదన వినిపిస్తూనే ఉన్నారు. హైదరాబాదుపై ప్రయోగాలు చేసి ఎవరికీ కాకుండా చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. ఎందుకంటే నగరం అన్ని ప్రాంతాలవారిదన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారితోటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో లగడపాటి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచడానికే తప్ప.. మరే అంశానికీ తలొగ్గమని స్పష్టం చేశారు. దత్తపుత్రుడు, వేర్పాటు వాదుల అండతోనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎంపీ పునరుద్ఘాటించారు.