నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవులో అధికారులు ఐదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.