: హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు
గుర్తు తెలియని దుండగులు ఒక యువకుడిని హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు. అత్యంత దారుణమైన ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలోని గణేష్ నగర్ లో జరిగింది. సగానికి పైగా కాలిపోయిన యువకుడి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడు ఎవరనేది ఇంకా గుర్తించలేదు. హంతకులను కూడా ఇంతవరకు గుర్తించలేదు. సీసీ కెమెరాల్లో రికార్డయిని ఫుటేజ్ సహాయంతో నిందితులను గుర్తించే అవకాశం ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు.