: సురక్షిత ప్రాంతాలకు తరలిన 28 గ్రామాల ప్రజలు


హెలెన్ తుపాను నేపథ్యంలో ప్రకాశం జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. తుపాను ముప్పును సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, తీర ప్రాంతాల్లోని 11 మండలాల్లోని 28 గ్రామాల ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. దీనికి తోడు, 80 మంది సభ్యుల ఎన్ డీఆర్ఎఫ్ టీం ఇప్పటికే జిల్లాకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా 2 వేల మర పడవలు, 2,100 తెప్పలు, 24 పెద్ద పడవలు చేపల వేటకు దూరంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News