: 'తెహల్కా' తరుణ్ తేజ్ పాల్ 6 నెలల స్వీయ శిక్ష
సంచలనాలకు పెట్టిన పేరైన తెహల్కా మేగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్ పాల్ ఆరు నెలల పాటు విధులకు దూరం అయ్యారు. తోటి మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా, అవమానకరంగా ప్రవర్తించిన ఆయన.. అందుకు భేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు. అయితే, అది కూడా చాలదని, ఆరు నెలల పాటు విధుల నుంచి తప్పుకుంటున్నానని మేనేజింగ్ ఎడిటర్ షోమాచౌదరికి తెలిపారు.