: మరో రెండేళ్లకు మనమే మేటి


ఇప్పుడు యువతకు ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ అనేది కచ్చితంగా ఉంటోంది. బ్యాంకులో అకౌంట్‌ లేకపోయినా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ మాత్రం ఉంటుంది. ఇందులో స్నేహితులతో తమ అభిప్రాయాలను పంచుకోవడం, వంటి కార్యక్రమాలకు ఫేస్‌బుక్‌ చక్కగా ఉపకరిస్తుంది. దీంతో చాలామంది దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇలా ఎక్కువమంది ఫేస్‌బుక్‌ వాడుతూ పోతే మరో రెండేళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను ఉపయోగించే వారిలో మనమే నంబర్‌వన్‌గా నిలుస్తామని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఈ మార్కెటర్‌ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఫేస్‌బుక్‌ వినియోగంలో మరో రెండేళ్లకు భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి వస్తుందని తేలింది. ప్రస్తుతం ఫేస్‌బుక్‌ వినియోగంలో అమెరికా అగ్రస్థానంలో ఉందని, కానీ మరో రెండేళ్లకు అమెరికాను భారత్‌ అధిగమిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ ఏడాది దేశంలో 37.4 శాతం మేర ఫేస్‌బుక్‌ వినియోగదారుల వృద్ధి నమోదైంది. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే 2016 నాటికి మనదేశంలో ఫేస్‌బుక్‌ వినియోగదారులు అత్యధికంగా నమోదవుతారని అధ్యయనకారులు చెబుతున్నారు.

చైనాలో ఫేస్‌బుక్‌ను నిషేధించడంతో రానున్న కాలంలో అమెరికాను అధిగమించి భారత్‌లోనే ఫేస్‌బుక్‌ వినియోగదారులు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ను వినియోగించే వారి సంఖ్య 102.6 కోట్లు కాగా, అందులో అమెరికన్లు 14.7 కోట్లు. ప్రస్తుతం రెండవ స్థానంలో ఉన్న మనం మరో రెండేళ్లకు అమెరికాను అధిగమించి అగ్రస్థానంలో చేరతామని అధ్యయనంలో తేలింది.

  • Loading...

More Telugu News