: నాదెప్పుడూ సమైక్యవాదమే : మమతా బెనర్జీ


తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగానే ఉండాలని కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ రోజు కోల్ కతాలో మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలను విభజిస్తూ పోతే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ఐదేళ్లుగా మాట్లాడకుండా ఊరుకుని... ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ను ఎందుకు విభజిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చని... ప్రత్యేకంగా నిధులను కేటాయించుకోవచ్చని మమత అన్నారు. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం కచ్చితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. జగన్ తన సోదర సమానుడని తెలిపారు.

  • Loading...

More Telugu News