: ఐక్యరాజ్యసమితి వీడియో గీతంలో అనౌష్క శంకర్


ప్రపంచ ప్రఖ్యాత సితార్ వాద్యకళాకారుడు పండిట్ రవిశంకర్ ముద్దులతనయ అనౌష్క శంకర్ కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ధైర్య సాహసాలను వివరిస్తూ ఐక్యరాజ్యసమితి నేడు ఒక వీడియో గీతాన్ని విడుదల చేస్తోంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక గన్న 25 మంది ప్రముఖ మహిళలు కనిపించి, తమ సందేశాన్ని వినిపిస్తారు.

అలాంటి పాతిక మందిలో ఒకరుగా మన అనౌష్క అవకాశం పొందింది. ఇందులో ఆమె కూడా కనిపించి తన సందేశాన్ని పాట రూపంలో అందిస్తుంది. మహిళల్లో స్పూర్తిని నింపుతూ, సమాజంలో వారి హక్కులను తెలియజెబుతూ ఈ గీతం ఉత్సాహంగా సాగుతుంది.   

  • Loading...

More Telugu News