: ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అవాస్తవాలే: కవిత
హైదరాబాదు గురించి ముఖ్యమంత్రి పేర్కొన్నవన్నీ అవాస్తవాలేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలను ఎవరూ పొమ్మని అనరన్నారు. భద్రాచలం దేవాలయం తెలంగాణ ప్రజల శ్రమతో రూపొందిందని చెప్పారు. సత్యం, వాన్ పిక్, జగన్ కుంభకోణాలు.. ఇలా అన్నీ సీమాంధ్ర ప్రజలు చేసినవేనని పేర్కొన్న కవిత.. జలయజ్ఞంలో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపైన వివక్ష ఉందన్నారు. హైదరాబాదును కుంభకోణాల రాజధానిగా మార్చిన చరిత్ర సీమాంధ్రులదేనని.. అంతర్జాతీయ పత్రికలు ప్రచురించిన స్కాంలలో తెలంగాణ వారు ఎవరూ లేరన్నారు. హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ పైవిధంగా విమర్శించారు.