: విశాలాంధ్ర సభకు హాజరుకానున్న అసోం ఎంపీ
విశాలాంధ్ర మహాసభ కర్నూలులో రేపు భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు అసోం గణపరిషత్ ఎంపీ తోపో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, తమ ఆందోళన కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాల పార్టీలను కూడా భాగస్వాములను చేస్తామని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు తెలిపారు. రానున్న రోజుల్లో ఢిల్లీలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.