: సమైక్యంగా ఉంచేందుకు కేంద్రంతో పోరాడుతున్నా: సీఎం కిరణ్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమయం దొరికతే సమైక్యవాదాన్ని వినిపించేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తన పదవిని సైతం త్యాగం చేస్తానన్నారు. ఇందుకోసం కేంద్రంతో పోరాడుతున్నామన్నారు. విభజన జరిగితే కుక్కలు చింపిన విస్తరి చందాన పరిస్థితి తయారవుతుందని హెచ్చరించారు. రాష్ట్రం కలిసుంటేనే అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుతాయన్నారు. అతిపెద్ద రాష్ట్రం కావడంవల్లే కేంద్రం నుంచి మనకు ఎక్కువ నిధులు వస్తున్నాయన్నారు.

  • Loading...

More Telugu News