: తెలంగాణ ఏర్పాటు సాధ్యం కాదు: జేసీ
ఆర్టికల్ 371-డి విషయంలో అటార్నీ జనరల్ సూచనల మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ వాహనవతి చెప్పినట్టు జరిగితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని అన్నారు. నదిలో కొట్టుకుపోయే ముందు గడ్డిపరకలు పట్టుకున్నట్టు తాము రాయల తెలంగాణ అంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. శాసన సభాపతిపై అవిశ్వాసం పెడతామని ఎవరన్నారని దివాకర్ రెడ్డి మీడియాను ప్రశ్నించారు.