: నేను క్షేమంగానే ఉన్నా: శృతి హసన్
నిన్న (మంగళవారం)ఉదయం 9.30 గంటల సమయంలో ముంబయిలోని బాద్రాలోని తన నివాసంలో ఉన్న హీరోయిన్ శృతి హసన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. అయితే, తాను క్షేమంగానే ఉన్నానని శృతి ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇప్పుడంతా బాగానే ఉందని చెప్పింది. ఈ విషయంలో తనను పరామర్శించినందుకు శృతి అందరికీ కృతజ్ఞతలు కూడా చెప్పింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని వివరించింది.