: సీఎం కిరణ్ పై అవిశ్వాస తీర్మానానికి శంకర్రావు నోటీసు
సంచలనాలకు మారుపేరైన మాజీ మంత్రి శంకర్రావు ఇప్పుడు తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. ఏకంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు పంపించారు. నోటీసును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్టు ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని నోటీసులో శంకర్రావు కోరారు. అసమర్థుడైన కిరణ్ ప్రజావిశ్వాసం కోల్పోయారని ఆయన తెలిపారు. అవిశ్వాసానికి మద్దతు పలకాల్సిందిగా అన్ని పార్టీలకు లేఖలు రాయనున్నట్టు చెప్పారు. లేఖ ప్రతిని గవర్నర్ కు కూడా పంపానని అన్నారు.