: అన్నా హజారే వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి : కేజ్రీవాల్
ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఎక్కడనుంచి వచ్చాయని అన్నా హజారే వ్యాఖ్యానించిన అనంతరం... ఈ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అన్నా వ్యాఖ్యలు నన్నెంతగానో బాధించాయని కేజ్రీవాల్ అన్నారు. కేంద్ర హోం మంత్రి షిండే, ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ తనపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోనని... అవే వ్యాఖ్యలు తన గురువు అన్నా చేస్తే భరించలేనని తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నానని... వీలైనంత త్వరలో తనపై విచారణ జరిపించాలని కోరారు. అన్నా ఇప్పటికీ మాతోనే ఉన్నారని మేమెప్పుడూ అనలేదని... 'అన్నా లోక్ పాల్ బిల్లు'పై అన్నాకు అభ్యంతరాలుంటే తమ మేనిఫెస్టో నుంచి దాన్ని తొలగిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.