: ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏటీఎం దాడి బాధితురాలు
ఏటీఎంలో దాడికి గురైన బెంగళూరు మహిళ ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. ఆగంతుకుడు చేసిన దాడిలో ఆమె పుర్రె ఎముక విరిగిందని, వైద్యులు శస్త్ర చికిత్స చేశారని పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం వల్ల ఆమె చాలా నీరసించిపోయారని వైద్యులు తెలిపారు. కుడి పక్క ఆమెకు పక్షవాతం వచ్చిందని, మెదడుకు కూడా గాయమైందని వైద్యులు తెలిపారు. మరో రెండు మూడు నెలల వరకు ఆమె కోలుకునే పరిస్థితి లేదని, ఆమె ఇంకా షాక్ లోనే ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు.